- Advertisement -
ఫిఫా ప్రపంచకప్ 2022 ఫైనల్లోకి దూసుకెళ్లింది అర్జెంటీనా. సెమీఫైనల్లో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 3-0 తేడాతో గెలుపొంది సత్తాచాటింది. అల్వరెజ్ 2, మెస్సీ ఒక గోల్ చేయగా క్రొయేషియా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగింది.
ప్రపంచ కప్ సెమీఫైనల్ కు అర్జెంటీనా వెళ్లడం ఇది ఆరోసారి. 2018 ప్రపంచ కప్ ను ఫ్రాన్స్ గెలుచుకోగా, ఆ సమయంలో క్రొయేషియా రన్నరప్ గా నిలిచింది. ఈ సారి సెమీఫైనల్లోనే వెనుతిరిగింది.
అర్జెంటీనా 1986లో ప్రపంచకప్ గెలవగా 2014 ప్రపంచ కప్ లో రన్నరప్‌గా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ జట్టు మరోసారి ప్రపంచ కప్ గెలుచుకోలేదు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుండగా ఇవాళ రాత్రి రెండో సెమీఫైనల్లో ఫ్రాన్స్, మొరాకో తలపడనుండగా గెలిచిన జట్టుతో ఆడనుంది అర్జెంటీనా.
ఇవి కూడా చదవండి..
- Advertisement -