బద్మాష్.. బలిసిందారా..!

177
Watch Sekhar Kammula's #Fidaa Official teaser featuring Varun Tej & Sai Pallavi
Sekhar Kammula's #Fidaa Official teaser featuring Varun Tej & Sai Pallavi
- Advertisement -

‘ముకుంద’‌, ‘కంచె’, ‘లోఫ‌ర్’ వంటి విభిన్న సినిమాల‌తో మెగా హీరో వ‌రుణ్ తేజ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవల  శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమాకు ఊహించని విధంగా ప్రతికూలమైన టాక్ రావడంతో వరుణ్ తేజ్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఈ సినిమాతో కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుదామని ఆశపడిన వరుణ్‌కు ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు వరుణ్ నటించిన ముకుంద, కంచె చిత్రాలు క్లాస్‌వే. మిస్టర్‌తోనైనా కమర్షియల్ హీరోగా నిలదొక్కుకుందామనే కోరికకు ఆదిలోనే హంసపాదు పడింది.

ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఫిదా అనే చిత్రాన్ని చేస్తున్న వరుణ్.. ఈ సారి మాత్రం ప‌క్కా హిట్ కొట్టి తీరాల్సిందేన‌న్న క‌సితో ఉన్నాడు. సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్ర టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో ప్ర‌తి సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వరుణ్‌తేజ్‌ మాత్రం ఆమెను తలచుకుంటూ.. తను ఎదురుచూస్తున్న వ్యక్తి ఈమే అంటున్నాడు వరుణ్ తేజ్.  చిత్రంలో వరుణ్ తేజ్ అమెరికా అబ్బాయిగా నటించనుండగా, సాయి పల్లవి పక్కా తెలంగాణ అమ్మాయిగా కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ టీజర్‌లో బద్మాష్.. బలిసిందారా.. బొక్కలిరగ్గొడుతా.. అంటూ సాయి పల్లవి తెలంగాణ భాషలో మాట్లాడిన మాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇద్ద‌రి మ‌ధ్య సాగే అంద‌మైన‌ ప్రేమాయణంతో ఈ చిత్రం తెరకెక్కుతుండ‌గా , శ‌క్తి కాంత్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -