హీరోయిన్‌ అవ్వాలంటే తప్పదు మరి..

507
Pooja Hegde Hot Workout in Gym
- Advertisement -

హీరోయిన పూజా హెగ్డే ‘ముకుంద’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై ‘ఒక లైలా కోసం’ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఈలోగా బాలీవుడ్‌లో ఆఫర్‌ రావడంతో ముంబయికి ఎగిరిపోయింది.స్టార్‌ హీరో హృతిక్ రోషన్ పక్కన హీరోయిన్ గా అవకాశం వచ్చేసరికి ఆనందంతో ఎగిరిగంతేసింది. కానీ మొహెంజొదారో బాక్సాఫీస్ దగ్గర మొత్తంగా చతికిలపడింది. దీంతో మరోసారి లైమ్ లైట్ లోకి రావడానికి టాలీవుడ్ నే నమ్ముకుంది. దువ్వాడ జగన్నాథమ్ తో ఇండస్ట్రీని ఆకట్టుకుంటానని ఆశిస్తోంది.

Pooja Hegde Hot Workout in Gym

అయితే డీజే సినిమాలో తన అందాల ప్రదర్శన బాగానే ఇచ్చిందట.‘ఇదిగో.. ఇలా.. ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజీ ఇద్దామనుకుంటున్నావ్’ అంటూ దువ్వాడ జగన్నాథమ్ ను బెదరగొట్టిన పూజా హెగ్డే నిజ జీవితంలో సభ్య సమాజానికి మంచి మెసేజీ ఇస్తోంది. సినిమాల్లో టాప్‌ హీరోయిన్ గా రాణించాలంటే అందంగా ఉంటే సరిపోదని బాడీని కూడా స్లిమ్ గా ఉంచుకోవడం తప్పనిసరి అంటుంది.మరి దాని కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది అంటు సోషల్‌ మీడియాలో బాగానే హల్‌చల్‌ చేస్తోంది పూజ.

అయితే ఈ భామ తన బాడీ ఫిట్‌నెస్‌ కోసం ఇటీవల అత్యంత కష్టమైన హ్యాంగింగ్ పులప్స్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి నో ఎక్స్ క్యూజెస్ అంటూ కామెంట్ కూడా పెట్టింది. ఫిట్ నెస్ విషయంలో తాను ఎంత హార్డ్ వర్కరో ప్రూవ్ చేసుకుంటోంది. టాప్ హీరోయిన్‌ కావాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు. ఫిట్ గా పర్ ఫెక్ట్ గా ఉండాలంటే ఎంత కష్టపడాలో చూపిస్తూ పూజా సమాజానికి మంచి మెసేజే ఇస్తోంది. నవ్వుతూ పులప్స్ తీసిన పూజా హెగ్డే పై సోషల్ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది.

 

 

- Advertisement -