ప్రేమమ్ సినిమాలో తన అద్భుతమైన నటనతో కుర్రకారు మతిపొగొట్టింది మలయాళ బ్యూటీ సాయి పల్లవి. తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది. తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను అలరిచింది. కథలో బలం ఉంటేనే తప్ప తాను సినిమాలకు ఒప్పకుంటుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్.
టాలీవుడ్ లో ఆమె నటించిన సినిమాలు భారీ విజాయాలను అందుకున్నాయి. ఇటివలే ఆమె తెలుగు శర్వానంద్ సరసన పడిపడి లేచేమసను సినిమా లో నటించింది.ఆమె ప్రస్తుతం తమిళ్ లో సూర్య సరసన నటిస్తుంది. తాజాగా తన పెళ్లిపై స్పందించింది సాయి పల్లవి.
ఇటివలే ఓ ఇంటర్యూలో పాల్గోన్న సాయి పల్లవిని మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా అని అడగగా ఆమె సమాధానం ఇస్తూ… పెళ్ళీ గిళ్ళీ జాన్తా నై.. తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటూ జీవితాంతం పెళ్ళే చేసుకోనని తేల్చి చెప్పింది. ఈ అమ్మడి సమాధానికి నెటిజన్స్ బిత్తరపోతున్నారు. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం కన్యగానే ఉండిపోతావా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.