ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. కరోనా ఎఫెక్ట్‌కి కొన్ని దేశాలు లాక్ డౌన్ కొనసాగిస్తుండగా భారత్‌లాంటి మరికొన్ని దేశాలు కొన్ని సడలింపులతో కరోనాపై పోరును కొనసాగిస్తున్నాయి.
ఇక కరోనాకు వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు విపరీతంగా ప్రయత్నాలు చేస్తుండగా కరోనా టెస్టులకు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చింది. ఇప్పటివరకు కరోనా బాధితులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించి రిజల్ట్స్ వచ్చే వరకు ఎక్కువ సమయం పట్టేది.
అయితే ఇకపై ఈ పరిస్థితి ఉండబోదు. ఎందుకంటే కేవలం గంట వ్యవధిలోనే కచ్చితమైన ఫలితాలు రానున్నాయి. ఇందుకు సంబంధించిన కిట్స్ మరో నాలుగు వారాల్లో దేశంలో అందుబాటులోకి రానున్నాయి.
ఫెలూదా అనే ఈ టెస్టింగ్ పాలసీలో కొవిడ్-19ను నిర్ధారించేందుకు సుమారు రూ.500 ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలోని కౌన్పిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (CSIR-IGRB) శాస్త్రవేత్తలు ఈ కిట్స్ ని కనిపెట్టారు.