ఫిబ్రవరి 10..గుల్‌మార్గ్‌లో ఖేలో ఇండియా

21
- Advertisement -

జమ్మూ కశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో జరగబోయే మూడవ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌ … మస్కట్‌, థీమ్‌, సాంగ్‌, జెర్సీని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విడుదల చేశారు. జమ్మూ మరియు కాశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్, అలాగే జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క వింటర్ గేమ్స్ అసోసియేషన్ ద్వారా నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఈ వింటర్ గేమ్స్‌ ఫిబ్రవరి 10 నుంచి 14వరకు జరగనున్నాయి. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1500మంది అథ్లెట్లు పాల్గొంటారని తెలిపారు. తొమ్మిది క్రీడా ఈవెంట్లలో క్రీడాకారులు పాల్గొంటున్నట్టు అందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటివరకు ఖేలో ఇండియా రెండు సార్లు నిర్వహించారు. అయితే ఈ రెండు ఎడిషన్లో జమ్మూ మరియుకాశ్మీర్ రికార్డు స్థాయిలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి…

భారత్ ముందు కివీస్ చిత్తు..

మూడేళ్ల తర్వాత..సెలబ్రిటీ క్రికెట్ లీగ్

మమ్మల్ని ఎదుర్కొవం చాలా కష్టం…

- Advertisement -