గ్రీన్ ఛాలెంజ్‌లో అనిల్ కూర్మాచలం

22
- Advertisement -

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్   చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు తన జన్మదినం సందర్బంగా మొక్కను నాటిన రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ మాజీ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పచ్చని ఆశయానికి అండగా నిలవడానికి తన వంతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కను నాటడం సంతోషంగా ఉందని అన్నారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  హరితహారం కార్యక్రమం స్పూర్తితో సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరు పాల్గొని మొక్కలను నాటి పర్యవరణ పరిరక్షణకు తోడ్పడాలని అన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటినందుకు సంతోషంగా ఉందని ఎంపీ సంతోష్ కుమార్  కి ధన్యవాదాలు తెలిపారు.

Also Read:శివరాత్రి ప్రాముఖ్యత ఏంటో తెలుసా ?

- Advertisement -