ట్రంప్‌కి షాకిచ్చిన ఫేస్ బుక్‌..!

228
trump
- Advertisement -

ట్రంప్‌కు షాకిచ్చింది ఫేస్ బుక్‌. ట్రంప్‌ ఖాతాపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది. జనవరి 6న ఫేస్​బుక్​ ద్వారా ట్రంప్​ చేసిన పోస్టులు సంస్థ నియమాలను ఉల్లంఘించాయని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు నిక్‌ క్లెగ్ పేర్కొన్నారు. దీంతో రెండేళ్ల పాటు ట్రంప్‌ ఖాతాను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

ఆ తర్వాత మరోసారి నిర్ణయంపై మరోసారి సమీక్ష జరుపుతామని వెల్లడించింది. ఇక ట్రంప్ సస్పెన్షన్‌ పై స్పందించారు వైట్ హౌస్ సెక్రటరీ జెన్ సాకి. ఖాతాల నిషేధంపై నిర్ణయాలను ప్లాట్‌ఫామ్‌లను నడుపుతున్న సంస్థలకే వదిలేయాలన్నారు. ఎన్నికలైనా, టీకాల గురించి అయినా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌.. మరేదైనా ప్లాట్‌ ఫారమ్‌.. తప్పుడు సమాచార వ్యాప్తిని కంపెనీలు అరికట్టాలన్నారు.

- Advertisement -