కన్న కూతురికి తండ్రి సెల్యూట్!

41
police

ఏపీ పోలీస్ శాఖలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఏపీ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ డ్యూటీ మీట్ 2021 ఇగ్నైట్‌లో ఓ తండ్రి తన కూతురికి సెల్యూట్ చేశారు. అయితే ఇందులో విశేషమెంటంటే..ఉన్నతాధికారైన తన కూతురికి సెల్యూట్ చేసి ప్రేమ-గర్వంతో మునిగిపోయారు ఆ తండ్రి.

వివరాల్లోకి వెళ్తె… తిరుపతి కళ్యాణి డ్యామ్‌ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో సీఐగా పనిచేస్తున్నారు శ్యామ్ సుందర్‌. అతని కూతురు 2018 బ్యాచ్‌కి చెంది ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు.

తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్‌లో దిశ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తుండగా డ్యూటిలో ఉన్న తన కూతురిని చూస్తూ మురిసిపోయారు శామ్. తన కూతురు తనకంటే పెద్ద ర్యాంక్ లో తన కంటి ముందు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ డ్యూటీ చేస్తుండటం దూరం నుండి చూస్తూ ఆనందంగా దగ్గరకెళ్ళి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేశారు.

ఈ దృశ్యం అక్కడ ఉన్నవారందరిని కదిలించగా తండ్రి,కూతళ్లపై ప్రశంసలు గుప్పించారు జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి. ఇలాంటి సన్నివేశం సహజంగా నినిమాలో చూస్తుంటామ్ కానీ రియల్ లైఫ్‌లో తండ్రీ కూతురు ఇలా యూనీఫామ్ ధరించి ప్రజాసేవ చెయ్యటం గొప్ప విషయమని అభినందించారు.