కేరళలో నన్‌పై జరిగిన అత్యాచార ఘటన మరో మలుపు తిరిగింది. నన్‌పై బిషప్ ఫ్రాంకో ములక్కన్ అత్యాచారం చేశారన్న ఘటనలో కీలక సాక్షి చనిపోయాడు. ఫాదర్ కురియాకోస్ కత్తుథర పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న ఓ చర్చిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. ఈ కేసులో బిషప్ ఫ్రాంకోకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన అనంతరం ఈ ఘటన జరగడం సంచలనం రేపుతోంది.
ఈ కేసు నుంచి తప్పుకోకపోతే చంపేస్తామని ఫాదర్ కురియకోస్‌ను కొంత మంది వ్యక్తులు బెదిరించారు. అయితే.. ఆ బెదిరింపులను పట్టించుకోకపోవడంతో కిరాతకంగా హత్య చేశారని బిషప్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దుండగులకు శిక్ష పడాలని.. ఈ కేసులో తాము న్యాయ పోరాటానికి దిగుతామని వారు స్పష్టం చేశారు. ఈ కేసులో మొత్తం వంద మందిని పోలీసులు ప్రశ్నించారు.
#WATCH: AR Sharma, DSP Dasuya, says on death of Kerala nun rape case witness Father Kuriakose Kattuthara, "It was found that he vomited over the bed. Blood pressure tablets were found at the spot. Investigation is underway" pic.twitter.com/TChDoaWfes
— ANI (@ANI) October 22, 2018