వీడియో.. నివాస ప్రాంతాల్లో కూలిన విమానం

14
- Advertisement -

సూడాన్‌ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సయిద్నా ఎయిర్ బెస్ నుంచి మంగళవారం రాత్రి ఆర్మీ ఫ్లైట్ టేకాఫ్‌ అవుతుండగా..గాల్లోకి ఎగిరిన కాసేపటికే నివాస ప్రాంతంలో కూలిపోయింది. మృతుల్లో ఆర్మీ అధికారులతో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనలో 46 మంది మృతి చెందారు.

వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ప్రమాద స్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:ఇంగ్లండ్‌పై ఆఫ్ఘానిస్తాన్‌ సంచలన విజయం

 

- Advertisement -