ఎమ్మెల్యేల కొనుగోలు..హైకోర్టు కీలక తీర్పు

189
telangana high court
- Advertisement -

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ పిటిష‌న్‌పై లోతైన విచార‌ణ కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని…ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు ద‌ర్యాప్తు చేసుకోవ‌చ్చ‌ని ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. అలాగే ఎమ్మెల్యేల‌ను కొనుగోలు కేసులో ప‌ట్టుబ‌డ్డ ముగ్గురు నిందితుల ద‌ర్యాప్తుపై కోర్టు స్టే ఎత్తేసింది.

ప్రస్తుతం ఈ కేసులో ఉన్న నిందితులు రామచంద్ర భారత అలియాస్ సతీశ్ శర్మ, సింహయాజీ, నంద కుమార్‌ చంచ‌ల్ గూడ జైల్లో ఉన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారనే ఆరోపణలతో మోయినాబాద్ ఫాం హౌస్‌లో ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో వీరిపై కేసుల నమోదుచేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -