ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయవద్దని పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతుల ఉద్యమం పశ్చిమ బెంగాల్‌కు చేరుంది. ఈ సందర్భంగా మాట్లాడిన రైతు సంఘాల నేతలు…బీజేపీకి వ్యతిరేకంగా తాము ప్రచారం చేస్తామని తెలిపారు.
కోల్‌కతాలోని భవానిపోరా, నందిగ్రామ్‌లో నిర్వహిస్తున్న రైతు మహాపంచాయతీల్లో పాల్గొని కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. ఆదివారం నాడు సింగూర్, అసన్సోల్‌లో కూడా రైతు మహా పంచాయతీలను నిర్వహించనున్నారు.
బీకేయూతోపాటు యునైటెడ్ కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్‌ను ప్రారంభించింది. వీరు కూడా బీజేపీని బహిష్కరించాలని, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయవద్దని ఇప్పటికే బెంగాల్‌లోని మారుమూల గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. బీజేపీకి గుణపాఠం నేర్పేందుకే ఈ ఉద్యమం చేపట్టామని, అయితే ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని, ఓ ఒక్కరికి ఓటేయాలని కోరడం లేదని ఎస్‌కేఎం నాయకుడు యోగేంద్ర యాదవ్ తెలిపారు.