కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. కేంద్రం ప్రతిపాదనలు కార్పొరేట్లకు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయని ఆరోపించిన రైతు సంఘాలు నేటి నుండి ఆందోళనను మరింత ఉదృతం చేశాయి. ఈనెల 12వ తేదీన ఢిల్లీ-జైపూర్ హైవేను దిగ్భంధించనుండగా ఈనెల 14వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధర్నాలతో పాటు జాతీయ రహదారులను దిగ్భందించనున్నాయి.
ఎముకలు కొరికే చలిలో రైతన్నలు చేస్తున్న ఆందోళనలకు అందరి మద్దతు లభిస్తోంది. రైతుల డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం కొన్ని సవరణల ప్రతిపాదనలు పంపించినా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుల పట్టబడుతున్నారు. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది.
వ్యవసాయ చట్టాల పట్ల రైతులకు ఉన్న అపోహలు తొలగిస్తున్నాం అని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. వ్యవసాయ చట్టాల వాళ్ళ రైతులకు మేలు జరుగుతుందని…కాంటాక్ట్ వ్యవసాయంతో రైతుల భూమికి రక్షణ ఉంటుందని తెలిపారు.