పైజర్ టీకాకు అమెరికా అనుమతి…

215
pfoizer
- Advertisement -

కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్‌. బ్రిటన్‌లో ఇప్పటికే ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అనుమతి లభించగా 80ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నారు. తర్వాత కరోనా వారియర్స్‌కు, అనంతరం మిగతా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. యూకేలో సెకండ్ వేవ్ విజృంభిస్తండటంతో యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తాజాగా ఫైజ‌ర్ రూపొందించిన టీకా అత్య‌వ‌స‌ర వినియోగానికి అమెరికా అనుమ‌తి ఇచ్చింది. ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఫ్‌డీఏ)కు చెందిన నిపుణుల క‌మిటీ నిర్వ‌హించిన ఓటింగ్‌లో ఫైజ‌ర్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ద‌క్కింది.

కోవిడ్‌19 టీకా వ‌ల్ల‌ 16 ఏళ్లు దాటిన వారిలో ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గ‌లేద‌ని గుర్తించారు. ఇప్ప‌టికే ఫైజ‌ర్ టీకాకు కెన‌డా, బహ్రాయిన్‌, సౌదీ అరేబియాలో ఆమోదం తెలిపాయి.

- Advertisement -