15వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు…

308
farmers
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన 15వ రోజుకు చేరాయి. రైతులతో పలు దఫాలుగా కేంద్రం చర్చలు జరిపిన ఫలించలేదు. కేంద్రం పంపిన ప్రతిపాదనలను సైతం రైతు సంఘాల నేతలు తిరస్కరించారు.

ఇక ఇవాళ్టి నుండి ఆందోళనలను మరింత తీవ్రతరం చేయాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. డిసెంబర్‌ 12న ఢిల్లీ-జైపూర్‌, ఢిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్బంధించాలని, దేశవ్యాప్తంగా రహదారులపై టోల్‌ ఫీజు చెల్లించకూడదని పిలుపునిచ్చారు.

ఈనెల 14న దేశవ్యాప్తంగా మరోమారు ఆందోళలన నిర్వహించనున్నారు. కొత్తగా రూపొందించిన చట్టాలను రద్దుచేయాలని సింఘు, టిక్రీ, ఘాజిపూర్‌, నోయిడా సహా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో రైతులు బైఠాయించిన రహదారులను పోలీసులు మూసివేశారు. వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని రైతులు పట్టుబడుతుండగా కేంద్రం మాత్రం కొన్ని సవరణలతో చట్టాన్ని యధావిథిగా ఉంచాలని భావిస్తోంది. దీంతో చర్చలు అసంపూర్తిగానే ముగుస్తున్నాయి.

- Advertisement -