అన్నదాతల ఆందోళన..ఏడాది పూర్తి

209
farmers
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన అన్నదాతల ఆందోళనలకు నేటితో ఏడాది పూర్తయింది. గతేడాది నవంబర్ 26న ఢిల్లీని ముట్టడించారు రైతులు. ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా సాగు చట్టాల రద్దు, మద్ధతు ధర కోసం ఆందోళన కొనసాగించారు. కేంద్రం మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగా కనీస మద్ధతు ధరకు చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

విద్యుత్ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా నేడు దేశవ్యాప్త కార్యక్రమాలు చేపట్టనుండగా ఉద్యమంలో అమరులైన రైతులకు నివాళులు అర్పించనున్నారు.

- Advertisement -