రైతుల ఛలో ఢిల్లీ..టీయర్ గ్యాస్ ప్రయోగం!

19
- Advertisement -

అన్నదాతలు మళ్లీ రొడ్డెక్కారు. తమ డిమాండర్లను పరిష్కరించాలని ఆందోళన బాటపట్టారు. పంజాబ్‌, హర్యానాకు చెందిన రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునివ్వగా దేశ రాజధాని సరిహద్దుల్లో బారీగా పోలీసులను మొహరించారు.

యూపీ గేట్‌తో సహా అన్ని ప్రధాన రహదారులపై పోలీసులు బారికేడ్లు వేసి తనిఖీలు చేపడుతున్నారు. దాంతో రాకపోకలపై ప్రభావం పడుతోంది. ఇప్పటి వరకు ఘాజీపూర్‌ నుంచి మార్కెట్‌కు కూరగాయలు తీసుకెళ్లేందుకు ఆటోలకు రూ.200 నుంచి రూ.300 వరకు చెల్లించాల్సి వచ్చేదని.. ప్రస్తుతం రూ.500 చెల్లించాల్సి వస్తుందన్నారు. ముందుగా ఆటోలు మార్కెట్‌కు వచ్చి తిరిగి రావాలంటే సమయం భారీగా పడుతుందని.. అందుకే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కనీస మద్దతు ధర చట్టం చేయాలని, స్వామి నాథన్ కమిషన్ ఇచ్చిన సూచనలు అమలు చేయాలనే డిమాండ్‌తో200 రైతు సంఘాలు ఛలో ఢిల్లీ పాదయాత్రకు పిలుపునిచ్చాయి. దీంతో పార్లమెంట్ ముట్టడికి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. రైతులతో కేంద్రమంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇక శంభూ సరిహద్దులో రైతులపై టీయర్ గ్యాస్ ప్రయోగించగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Also Read:ప‌న‌స పండ్లు ఎక్కువ‌గా తింటున్నారా?

- Advertisement -