రంగనాయక సాగర్‌కు గోదావరి జలాలు..ఆనందంలో రైతులు

9
- Advertisement -

సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ లోకి పరుగులు పెట్టాయి గోదావరి జలాలు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ తో.. సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్ లకు గోదావరి జలాలు తరలాయి. హరీష్ చొరవతో రంగనాయక సాగర్‌కు గోదావరి జలాలు రాగా అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం ప్రాజెక్టుల్లో జలాలు అడుగంటాయని ఉత్తమ్ కుమార్‌కు లేఖ రాశారు హరీష్‌ రావు. సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టులు అడుగంటుతున్నాయని మిడ్ మానేరు నుండి నీటిని ఎత్తిపోయాలని లేఖలో పేర్కొన్నారు. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారని… గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గి పోయిందన్నారు.

రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానెర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్‌లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

Also Read:KTR:తెలంగాణ ఉద్యమానికి అండగా జయశంకర్ సార్

- Advertisement -