Farmers Protest: రైతుల ఢిల్లీ మార్చ్‌..ఇంటర్నెట్ బంద్

2
- Advertisement -

పంటలకు మద్దతు ధర కోసం రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ మార్చ్ ఉద్రిక్తంగా మారింది. గ్రేటర్ నోయిడా దగ్గర ఆందోళనలో చేపట్టిన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆందోళనలకు సంబంధించిన వార్తలు ప్రసారం కాకుండా హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంబాలా జిల్లాలోని 11 గ్రామాల్లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను డిసెంబర్ 9 వరకు నిలిపివేసింది. అంతేకాకుండా 163 సెక్షన్​ను అమలు చేశారు.

నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారీగా రైతులు రావడం వల్ల గ్రేటర్ నోయిడాలో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.100 మంది రైతుల బృందం శాంతియుతంగా దిల్లీ వైపు కవాతు చేస్తుందని శంభు సరిహద్దు వద్ద ఉన్న రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. బారికేడ్లను బద్దలుకొట్టే ఉద్దేశం మాకు లేదని స్పష్టం చేశారు.

శాంతియుతంగా నిరసన తెలిపేందుకు హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు తమకు అనుమతినిస్తాయని భావిస్తున్నాం అన్నారు. మా ప్రధాన డిమాండ్ పంటలకు కనీస మద్దతు ధర… పంజాబ్ ప్రభుత్వం ఎంఎస్​పీ అందిస్తుందని హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ నెరవేర్చలేదు అని మండిపడ్డారు.

Also Read;అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..

- Advertisement -