రైతుల ఆందోళన.. 163 రైళ్లు రద్దు

2
- Advertisement -

రైతులపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ పంజా బ్ బంద్‌కు రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్‌తో పంజాబ్ మొత్తం స్తంభించిపోగా రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.

బంద్ నేపథ్యంలో వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి. రోడ్డు, రైలు మార్గాలను రైతులు దిగ్బంధించారు. ఢిల్లీ – పంజాబ్‌ మధ్య రాకపోకలు సాగించే దాదాపు 163 రైల్వే సర్వీసులకు రద్దయ్యాయి.

పంజాబ్ వ్యాప్తంగా దాదాపు 200కిపైగా రోడ్లను రైతులు బ్లాక్‌ చేశారు. రవాణా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా విమానాలు, వైద్య, పెళ్లి, ఉద్యోగ ఇంటర్వ్యూ సహా అత్యవసర సేవలను బంద్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్‌ కొనసాగనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి.

Also Read:తెలంగాణ ఆత్మబంధువు మన్మోహన్: రేవంత్ రెడ్డి

- Advertisement -