ప్రభుత్వంపై రైతుసంఘాల ఫైర్

2
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు… ఈ కార్యక్రమంలో హై కోర్ట్ న్యాయవాది పాదురి శ్రీనివాస్ , తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి దూదిపాల విజయ్ పాల్ రెడ్డి , రైతులు సింగి రామస్వామి , మల్లారెడ్డి , శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం రైతులు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది అని తెలిపారు..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు తెలంగాణ రైతులకు అనేక హామీలు ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదు..అందులో ముఖ్యంగా అధికారంలో రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అవసరం లేని నిబంధనలతో ఆగం పట్టిస్తున్నారు అని ఆరోపించారు.

రైతు భరోసా రెండు పంటలకు కలిపి సంవత్సరం కు 2 సార్లు ఇస్తామని వాన కాలం పంటకు రైతు భరోసా ఎగబెట్టి అవసరం లేని ఆంక్షలు విధించి 6 వెలుగా నిర్ణయించి ఇంతవరకు రైతుల ఖాతా లో జమ చేయలేదు…మీకు రైతుల ఓటు బ్యాంక్ కావాలనుకుంటే 15 వేల చొప్పున కలిపి వెంటనే చెల్లించాలి…వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని సన్నవడ్లు , దొడ్డు వడ్లు సాకుతో బోనస్ సన్నవడ్ల కు ఇచ్చి చేతులు దులుపుకున్నారు…సన్న ధాన్యం పంట దిగుబడి రావటం లేదు, రైతులకు గిట్టుబాటు కావడం లేదు.దొడ్డు దాన్యాయానికి బోనస్ ఇచ్చి రైతులందరిని ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం..లేని పక్షంలో రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని తేల్చిచెప్పారు.

Also Read:నీళ్లు లేక అల్లాడుతున్న ప్రజలు!

- Advertisement -