సీఎంఆర్‌ఎఫ్‌కు రైతు విరాళం..

44
cm
- Advertisement -

కాళేశ్వరం జలాలతో ఎండిన బీల్లను సస్యస్యామలం చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ రుణం తీర్చుకోవాలని సంకల్పించిండు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెల్ల పల్లి మండలం, బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివాస్ రెడ్డి అనే యువ రైతు. ఇన్నాల్లూ బీల్లుగా మారిన తన వ్యవసాయ భూమినుంచి కాళేశ్వర జలాల సాయంతో పంటలు పండిస్తూ ఆదాయాన్ని పొందుతున్నాడు. తాను పండించిన పంటలో కొంత భాగాన్ని పేదలకోసం ఖర్చు చేయాలని,అందులో భాగంగా కొంత మొత్తాన్ని ‘‘ముఖ్యమంత్రి సహాయ నిధి’’ కి అందించాలని నిర్ణయించుకున్నాడు.

అందుకోసం…ఏడాది లో తాను పండించే రెండు పంటలనుంచి వచ్చిన ఆదాయాన్ని ‘‘పంటకు పదివేల రూపాయల’’ చొప్పున ఆరునెల్లకోసారి సిఎంఆర్ఎఫ్ కు జమ చేయాలనే తలచాడు. తలచిందే తడవుగా.. శుక్రవారం ప్రగతి భవన్ కు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తాను తెచ్చిన 10 వేల రూపాయలను అందించాడు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి రంగం అభివృద్దితో పాటు విద్యుత్ తదితర అనుబంధ రంగాల అభివృద్ధితో.. తెలంగాణ యువత వ్యవసాయాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవడం సంతోషకరం. అంతే కాకుండా వాణిజ్య పంటలను వినూత్నరీతిలో పండిస్తూ నికరాదాయన్ని గడిస్తున్నారు. ఏదో సంస్థలో అర కొర జీతానికి పనిచేయడమే ఉద్యోగం అనే మానసిక స్థితినుంచి వారు బయటపడుతుడడం ఆహ్వానించదగ్గ పరిణామం. తమ తమ స్వంత గ్రామాల్లోనే పచ్చని పంటపొలాల నడుమ ప్రకృతితో భాగమై ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగిస్తూ వ్యవసాయాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుని తమ సొంత కాల్లమీద నిలబడడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి తన సంపాదనలోంచి సామాజిక బాధ్యతగా కొంత మొత్తాన్ని కేటాయించాలనుకోవడం గొప్ప విషయం. సిఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు సాయం చేసేందుకు తన పంటలో కొంతభాగాన్ని కేటాయించేందుకు ముందుకు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి స్పూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలి. అతనికి నా అభినందనలు..’’ అని సీఎం కేసీఆర్ రైతు శ్రీనివాస్ రెడ్డి గొప్పతనాన్ని కొనియాడారు.

- Advertisement -