మ్యాచ్ ఫిక్సింగ్..టేలర్‌పై వేటు

59
taylor

మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో మరో ఆటగాడిపై వేటు పడింది. జింబాబ్వే సీనియర్ ఆటగాడు,ఆ జట్టు మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్‌పై వేటు వేసింది ఐసీసీ. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డ్డానంటూ టేల‌ర్‌ ఒప్పుకోవడంతో అతడిని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది ఐసీసీ.

2019లో ఓ భారత వ్యాపారవేత్త, తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడని, 15 వేల అమెరికన్‌ డాలర్లు ఆఫర్‌ చేశాడని..అతడి నుండి కొంత డబ్బు కూడా తీసుకున్నానని టేలర్ వెల్లడించడంతో అతడిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది ఐసీసీ.

టేలర్ 28 జూలై 2025న క్రికెట్‌ జర్నీని తిరిగి ప్రారంభించవచ్చని ఐసీసీ పేర్కొంది.