ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఫరీదుద్దీన్ నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహరెడ్డి హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగియనుంది. ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఫరీదుద్దీన్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
మంగళవారం నామినేషన్ల పరిశీలన, ఆరో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. పోలింగ్ 17న జరుగనున్నది. ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు తప్ప మరో పార్టీకి అభ్యర్థ్ధి గెలిచే అవకాశాలు లేనందున, ఆయా పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపే అవకాశం లేదని, ఫరీదుద్దీన్ ఎన్నిక లాంచనమే కానున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాగా, ఉపఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలకుడిగా అనిల్‌కుమార్‌ఝా సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. కర్ణాటక ఎన్నికల కమిషన్ సీఈవోగా ఉన్న అనిల్‌కుమార్ బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకుని ఉపఎన్నిక కోసం ఇక్కడచేసిన ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఆదివారం ఆయనతో రిటర్నింగ్ అధికారి సదారాం, సహాయ అధికారి నరసింహాచార్యులు ఫోన్‌లో ఏర్పాట్లను వివరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీకి ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే.