ప్చ్.. అత్యాశే ఆ బ్యూటీని ముంచింది

37
- Advertisement -

జాతి రత్నాలు అనే సినిమాతో యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా టాలీవుడ్ కుర్రకారు మనసులను ఒక రేంజ్ లో దోచేసింది. ఆ మధ్య కుర్ర కథానాయికల్లో ఫరియా అబ్దుల్లా పేరు మార్మోగిపోయింది. తొలి సినిమా జాతి రత్నాలు నుంచే ఈ సుందరి చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. పైగా ఫరియా అబ్దుల్లా అటు గ్లామర్ పరంగానూ .. ఇటు నటన పరం గానూ బాగా ఆకట్టుకుంది. లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ అనే సినిమాలోనూ ఫరియా అబ్దుల్లా కి మంచి క్యారెక్టర్ దొరికింది. మొత్తానికి ఫరియా అబ్దుల్లా నటిగా హిట్ అవ్వడంతో ఆమె రేంజ్ డబుల్ అయ్యింది. ఐతే, ఆ రేంజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఫరియా అబ్దుల్లా తన రెమ్యునరేషన్ ను ఫుల్ గా పెంచేసింది.

బంతి పువ్వు లాంటి ఈ బ్యూటీ సడెన్ గా రేటు పెంచడంతో… ఫరియా అబ్దుల్లా పై మేకర్స్ ఆసక్తి చూపించడం లేదు. ఫరియా అబ్దుల్లా అడిగినంత ఇవ్వడానికి ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దాంతో స్పీడ్ గా ఎదిగిన ఫరియా అబ్దుల్లా, ఇప్పుడు అంతే స్పీడ్ తో డౌన్ ఫాల్ అయిందని టాక్ నడుస్తోంది. ఎలాగూ ఫరియా అబ్దుల్లా ఫ్లాపులు కూడా మూటగట్టేసుకుంది. దీనికితోడు అధిక రెమ్యునరేషన్ పై ఆశ పడింది. అప్పటి నుంచి ఆమె కొత్త ప్రాజెక్టులలో పెద్దగా కనిపించడం లేదు. రవితేజ తో కలిసి చేస్తున్న రావణాసుర సినిమా తప్ప, మరో సినిమాలో ఫరియా అబ్దుల్లా ఉన్న దాఖలాలు కనిపించడం లేదు.

పైగా మోర్ మనీ కోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్, బంగార్రాజు వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. మొత్తమ్మీద గతంలో మాదిరిగా ఫరియా అబ్దుల్లా గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడుకోవడం లేదు. ఫరియా అబ్దుల్లా జోరు తగ్గిందా ?, లేక అత్యాశతో ఆమెనే దూకుడును తగ్గించుకుందా ? అనేదే ప్రశ్న. కేవలం ఫరియా అబ్దుల్లా భారీ రెమ్యునరేషన్ కోసం వచ్చే ప్రాజెక్ట్ లను కూడా పోగొట్టుకుంది. దీంతో అసలుకే మోసం వస్తోందేమో అంటూ నెటిజన్లు ఫరియా అబ్దుల్లాకి కామెంట్లు పెడుతున్నారు. ఏది అయితే ఏం.. అత్యాశే ఆమెను ముంచింది.

ఇవి కూడా చదవండి..

 

- Advertisement -