SSMB28 సంక్రాంతికేనా?

12
- Advertisement -

మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న‘SSMB28’ ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. మొదటి షెడ్యుల్ లో ఇప్పటికే కొన్ని సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలు షూట్ చేశారు. ప్రస్తుతం, శంకరపల్లి గ్రామ సమీపంలో, కొత్త షెడ్యూల్ కోసం 10 కోట్లతో రాజభవన బంగ్లా భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను ఆగస్ట్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పటికే అదే డేట్ టార్గెట్ పెట్టుకొని త్రివిక్రమ్ అండ్ టీమ్ వర్క్ చేస్తుంది. అయితే ఈ షూటింగ్ అప్పటి వరకు పూర్తవడం కష్టమనిపిస్తుంది. త్రివిక్రమ్ ప్లానింగ్ ప్రకారం షూట్ అనుకున్న టైం కి ఫినిష్ చేసినా ఈ సినిమా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమనే టాక్ వినబడుతుంది.

ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ఆగస్ట్‌లో మిస్ అయితే దసరా లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే ప్రాజెక్ట్ కే సంక్రాంతికి ఎనౌన్స్ చేశారు మేకర్స్. #RC15 కూడా సంక్రాంతి రేస్ లో నిలిచే అవకాశం ఉంది. మరి మహేష్ సినిమా కూడా సంక్రాంతి కి వస్తుందా? తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే యూనిట్ ఆగస్ట్ రిలీజ్ అన్నట్టుగానే వర్క్ చేస్తున్నారు.

- Advertisement -