గోపిచంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గౌతమ్ నందా’. ఈ సినిమాపై పెట్టుకున్న ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరైయిపోవడంతో షాక్ లో ఉన్నాడు గోపిచంద్ . ‘రచ్చ’ ‘బెంగాల్ టైగర్’ సినిమాల తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన మూవీ“గౌతమ్ నంద”.ఈ సినిమాకు మొదట్లో డివైడ్ టాక్ రావడంతో ఎదోవిధంగా ఈసినిమాను నిలబెట్టాలని భారీ పబ్లిసిటీ చేసారు.
గతవారం ఈసినిమాకు పోటీగా ఏ సినిమాలు పెద్దగా పోటీ ఇవ్వకపోయినా ఫైనల్ గా మాత్రం ఈమూవీ భారీ ఫ్లాప్ నే మూటగట్టుకుంది. అయితే ఈవాస్తవాలను గుర్తించకుండా ఈ మూవీ మొదటి ఆరు రోజులకు 22 కోట్ల రూపాయలు గ్రాస్ వసూల్ చేసింది అంటూ ఒక పోస్టర్ ను ప్రముఖ పత్రికలలో అధికారికంగా ప్రచురించి అందరికీ షాక్ ఇచ్చింది చిత్ర టీమ్.
దీనితో ఈ పోస్టర్ ను చూసినవారు గోపీచంద్ పై ఘోరమైన సెటైర్లు వేయడం మొదలు పెట్టారు. అంతేకాదు ఈమూవీ ఆడుతున్న ధియేటర్లకు కనీసపు ప్రేక్షకులు కూడ కనిపించని క్రమంలో ఈ 22 కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి అంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు ఈ పోస్టర్ లో కనిపిస్తున్న స్పెలింగ్ మిస్టేక్ ను హైలెట్ చేస్తూ మరీ సెటైర్లు వేస్తున్నారు.
ఈ మూవీ గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది అంటూ ఇంగ్లీష్ లో ముద్రించిన ఈ పోస్టర్ లో ‘బిగ్గెస్ట్’ కు బదులు ‘బిగ్గెట్’ అని ముద్రించడంతో సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అంతేకాదు ‘మిస్టేక్’ కేవలం స్పెల్లింగ్ లోనేనా లేక కలెక్షన్స్ కూడానా అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా ఈసినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవచ్చు అనుకున్న గోపీచంద్ కు, సంపత్ నందికి ఈ సినిమా పెద్ద షాకిచ్చిందనే చెప్పాలి.