సలార్ పై ఫ్యాన్స్ లో భయం పోవట్లే?

28
- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ” సలార్ “, ప్రభాస్ బాహుబలి సిరీస్ తోను, ప్రశాంత్ నీల్ కే‌జి‌ఎఫ్ సిరీస్ తోను ఇద్దరు పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. అంచనాలకు తగ్గట్టుగానే మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక టీజర్ విషయానికొస్తే.. ఏ మూవీకి సాధ్యం కానీ రీతిలో తక్కువ టైమ్ లోనే వంద మిలియన్ల వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ లను సొంతం చేసుకుంది. .

టీజర్ తరువాత మూవీపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. కాగా మూవీని మొదట సెప్టెంబర్ 28 విడుదల చేస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సలార్ ర్యాంపేజ్ ఓ రేంజ్ లో ఉండేది. కానీ అనూహ్యంగా మూవీని పోస్ట్ పోన్ చేసి సినీ ఆడియన్స్ ను తీవ్రంగా నిరాశ పరిచింది చిత్ర యూనిట్. కాగా రిలీజ్ విషయంలో కొత్త డేట్ ప్రకటిస్తూ డిసెంబర్ 22 న సలార్ రిలీజ్ ఉంటుందని చిత్ర యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. అయినప్పటికి అభిమానులు హ్యాపీగా లేనట్లే తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ విషయంలో ఇప్పటికే ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.

సెప్టెంబర్ 28 రిలీజ్ పక్కా అనుకుంటే.. ఆ రోజు కూడా అభిమానులకు నిరాశే తప్పలేదు. దీంతో డిసెంబర్ 22 ననైనా రిలీజ్ అవుతుందో లేదో అని భయం అభిమానుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా డిసెంబర్ 22న షారుక్ ఖాన్ ” డంకి ” మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. దాంతో షారుక్ తో పోటీలో నిలిచే సాహసం ” సలార్ ” చిత్రా యూనిట్ చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే రెండు వెయ్యి కోట్ల సినిమాలతో మంచి సక్సస్ లో ఉన్నాడు షారుక్.. షారుక్ ఖాన్ తో పోటీకి సలార్ టీం సిద్దంగానే ఉంటుందా లేదా మళ్ళీ రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంటుందా అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. మొత్తానికి సలార్ విషయంలో క్లారిటీ వచ్చిన కన్ఫ్యూజన్ మాత్రం వీడడంలేదు.

Also Read:ప్రజాకవి అలిశెట్టి కుటుంబానికి అండగా ప్రభుత్వం..

- Advertisement -