పవన్ కి బ్యాడ్ నేమ్ తెస్తున్న ఫ్యాన్స్

15
- Advertisement -

‘నచ్చావులే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాధవీలత.. ఆ తర్వాత చిత్రాలతో ఆకట్టుకోలేకపోయింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవీలత తాను చేసే వ్యాఖ్యలతో ఫేమస్ అయింది. సరే ఆమె సంగతి పక్కన పెడదాం. ఆమె తీరు పై విమర్శలు ఆమెకు కొత్తేమీ కాదు. కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతిసారి ఇలాంటి వ్యక్తులతో ఎందుకు గొడవకు దిగుతారో అర్థం కాదు. రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ బర్త్ డేకు మాధవీలత ‘హ్యాపీ బర్త్‌డే టూ యూ మిస్టర్ పవన్ కళ్యాణ్. గాడ్ బ్లెస్ యూ’ అని సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది.

తన పోస్ట్‌లో మాధవీలత ‘మిస్టర్ పవన్ కళ్యాణ్’ అని రాయడంతో పవన్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. దీనిపై స్పందించిన మాధవిలత ‘ నా మనసుకు నచ్చితే ఏకవచనంతోనే పిలుస్తాను. మీరు ఏమైనా అనుకోండి. నేను మాత్రం పవన్‌ని అలాగే పిలుస్తా. ఏం పీక్కుంటారో పీక్కోండి’ అని చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యింది. కనీసం అప్పుడైనా పవన్ ఫ్యాన్స్ వదిలేయవచ్చుగా. లేదు, మళ్లీ ఆమెను ట్రోల్ చేస్తూ.. ఆమె పై అసభ్య పదజాలం వాడుతున్నారు. మాధవీలత చాలామంది హీరోలతో రిలేషన్‌లో ఉంది అని, ఆమె కొందరు రాజకీయ ప్రముఖులతో కూడా క్లోజ్ గా ఉంటుందని మాధవీలత పై నీచమైన కామెంట్స్ చేస్తున్నారు.

పైగా మాధవీలత తన అందాన్ని మరింత పెంచుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని.. కాకపోతే ఆమె పాలిట అది శాపంగా మారింది అని, సర్జరీ వికటించడంతో మాధవీలత మైండ్ దొబ్బింది అని.. పైగా ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో ఆమె కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడింది అని.. అందుకే ఆమె త్వరలో చనిపోతుంది అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. నిజంగా పవన్ ఫ్యాన్స్ తీరు చాలా దారుణంగా ఉంది. ఇలాంటి ప్రవర్తనతో వారంతా పవన్ కి బ్యాడ్ నేమ్ తీసుకువస్తున్నారు. ఏది ఏమైనా విషెస్ చెబితే ఇంత రచ్చ అవసరమా !!.

Also Read:ఓటీటీ : ఈ వారం ఏ చిత్రం ఎందులో ?

- Advertisement -