ఎప్పుడూ సోషల్ మీడియాలో రయ్ రయ్‌మంటూ చక్కర్లు కొట్టే శామ్..ఇప్పుడెందుకు కామ్ గా ఉంది? సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ..కావాల్సిన టాపిక్స్ తో పాటు, తనకు సంబంధంలేని టాపిక్స్ పై కూడా రియాక్ట్ అయ్యే సమంత ఇప్పుడు సైలెంట్ గా ఉండడం నెటిజన్లకు నచ్చడం లేదు. అంతేకాదు శామ్ స్పీడ్ కి ఇప్పుడు బ్రేక్ పడింది అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అసలు సమంత పై నెటిజన్లు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు? అంటారా…?
రీసెంట్ గా సీనియర్ ఆర్టిస్ట్ చలపతిరావు ఆడవాళ్ళ మీద చేసిన కామెంట్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. దాంతో టాలీవుడ్ సెలబ్రిటీలు చలపతిరావు చేసిన కామెంట్ ని ఖండించారు. కానీ సమంత మాత్రం ఇప్పటి వరకూ ఈ విషయంలో రియాక్ట్ కాలేదు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా వుండే సమంత ఈ విషయంలో మాత్రం సైలెంట్ గా వుండడం నెటిజన్లకి నచ్చలేదు. దాంతో సోషల్ మీడియాలో సమంత మీద సెటైర్లు పడిపోతున్నాయి.
గతంలో మహేష్ – సుకుమార్ కాంబోలో వచ్చిన ‘ నేనొక్కడినే ‘ పోస్టర్ విషయంలో ఆడవాళ్ళని అవమానించారంటూ సమంత రియాక్ట్ అయ్యింది. దాంతో అలా రియాక్ట్ అయిందో లేదో మహేష్ ఫ్యాన్స్ నుండి తీవ్రంగా విమర్శలు కూడా ఎదుర్కోంది. అప్పుడు అంతలా రియాక్ట్ అయిన సమంత ఇప్పుడు చలపతిరావు చేసిన కామెంట్ మీద రియాక్ట్ కాలేదని సామ్ ఫ్యాన్స్ కాస్త ఘరంగానే ఉన్నట్టున్నారు.
అసలు శామ్ రియాక్ట్ అవకపోడానిఇకి కారణం కేవలం నాగ చైతన్య సినిమా ఫంక్షన్ లో ఈ వివాదం జరిగింది కాబట్టే.. అని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో సామ్ తన ఫ్యాన్స్‌తో ఛాన్స్ దొరికినప్పుడల్లా..సరదా కబుర్లు చెప్పుకుంటూ..ఫ్యాన్స్‌కి మరింత దగ్గరైంది. అలాగే ఫ్యాన్స్ కూడా శామ్ అంటే తెగ ఇష్టపడతారు. అందుకేనేమో..చలపతిరావు ఆడవాళ్ళపై చేసిన చెత్త కామెంట్ పై శామ్ రియాక్ట్ అవలేదనే ఇలా ఫాన్స్ సెటైర్లు వేస్తుంది.