లక్షలు కురిపించిన ఫ్యాన్సీ నెంబర్లు..

263
Fancy Numbers Bring Big Bucks for TS Transport

ఫ్యాన్సీ నెంబర్లతో ఖైరతాబాద్‌ ఆర్టీఏ కాసుల పెట్టే గలగలలాడింది. కేవలం ఒక్కరోజులోనే ఫ్యాన్సీ  నంబర్ల ద్వారా ఒకే రోజు రూ.22,60,770లు ఆదాయం సమకూరింది. టీఎస్‌09 ఈఎస్‌ సిరీస్‌ ముగింపు, ఈటీ సిరీస్‌ ప్రారంభ నంబర్ల కోసం గురువారం పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. పలు ఫ్యాన్సీ నంబర్లకోసం 111 మంది వాహనదారులు టెండరులో పాల్గొన్నారు.

ఈ వేలంలో టీఎస్09ఈఎస్ 9999 నంబరు బెంట్లీ మల్సనే కారుకు దక్కింది. ఈ కారు ఖరీదు రూ.6,85,54,605. హెటరో డ్రగ్స్ సంస్థ రూ.10 లక్షలకు బెంట్లీ మల్సనే కారు కోసం ఈ నంబరును దక్కించుకుంది. అంతేగాకుండా టీఎస్09 ఈఎస్ 0099 నంబరును ఫెరారీ 488 జీటీబీ మోడల్ కారు (ధర రూ.4,49,16,455) దక్కించుకుంది.

సుషీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీ రూ.1,93,000 చెల్లించి వేలంలో ఈ నంబరును సంతం చేసుకుంది. ఇంటర్ కాంటినెంటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ తన ఇన్నోవా క్రిస్టా (ధర రూ.20,69,900) కోసం టీఎస్09ఈఎస్ 0009 నంబరు కోసం రూ.1,73,790 చెల్లించింది. పోటీలో గాయత్రి ప్రాజెక్ట్సు లిమిటెడ్ కొనుగోలు చేసిన బెంజ్ ఎస్ 350 సీడీఐ మోడల్ కారుకు (ధర రూ. 1,28,03,230) టీఎస్09ఈటీ 0007 నంబరును బిడ్‌లో రూ.1,15,000కు దక్కించుకుంది. కాగా బెంట్లీ మల్సనే కారు ఇప్పటివరకు నగరంలోనే అత్యంత ఖరీదైనదనీ ఖైరతాబాద్ ఆర్‌టీవో జీపీఎన్ ప్రసాద్ తెలిపారు.