సెప్టెంబర్ 17న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ కావడంతో క్రికెట్ ఫ్యాన్సంతా టీవీలకే అతుక్కుపోయారు. అందులో హీరో రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్‌వెల్ పట్టిన అద్బుతమైన క్యాచ్‌కి కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఈ సమయంలో అద్బుతమైన క్యాచ్‌కు సాక్ష్యంగా నిలిచినందుకు ఆనందంలో ఉండాలో.. విరాట్ కోహ్లీ ఔట్ అయినందుకు బాధ పడాలో అర్థం కావడం లేదంటూ ట్వీట్ చేశాడు. ఆ రోజు ఆదివారం కూడా కావడంతో జెమిని టీవీలో రాజ్ తరుణ్ నటించిన అంధగాడు సినిమా కూడా వస్తుండడం విశేషం. ఈ క్రమంలో ఓ అభిమాని.. ‘భయ్యా దయచేసి అంధగాడు మూవీ పైరసీ లింక్ ఇవ్వగలరా?’ అని డైరెక్టుగా రాజ్ తరుణ్‌ని అడిగేశాడు. దీనికి ‘అవాక్కయిన రాజ్ తరుణ్ నా సినిమా పైరసీ లింక్ నన్నే అడుగుతున్నావా సోదరా! అన్యాయం కదా’ అంటూ ట్వీట్ చేశాడు.
Naa cinema Piracy link nanne aduguthunaava bro!! Anyaayam kadhu!! 🙏
— Raj Tarun (@itsRajTarun) September 17, 2017
అంధగాడు మూవీలో రాజ్ తరుణ్ సరసన హెబ్బాపటేల్ నటించింది. ఈ మూవీ జూన్ 2న రిలీజ్ అయింది. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ.. మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్. అయితే మొదటిసారిగా ఈ హీరో అంధుడిగా నటించి మెప్పించాడు.