మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నాగబాబు కుమార్తె నిహారికలు ఓ ఇంటివారు కాబోతున్నారన్న వార్త అప్పట్లో వైరలైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ వార్తల్లో నిజం లేదని తేజు కొట్టిపారేయగా తాజాగా నాగబాబు స్పందించారు.
సాయి ధరమ్ తేజ్, నిహారికలు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఫూలిష్ వార్త, ఎవరో దరిద్రుడు ఇది క్రియేట్ చేశాడు. నిహారికని తేజూ చిన్నపటి నుండి ఎత్తుకొని తిరేగేవాడు. అతను నిహాని తన చెల్లెల్లిగా భావించాడు. ఎవరో పని పాట లేని వాళ్ళు పుట్టించే పుకార్లు అస్సలు నమ్మోద్దని అన్నారు.
గతంలో తేజు సైతం ఇలాంటి స్టేట్ మెంట్‌ని ఇచ్చిన సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచి ఒకే కుటుంబంలో కలిసిమెలిసి పెరిగామని, అందుకు అన్నా చెల్లెళ్లలా ఉంటామని చెప్పారు. తాము పెళ్లిచేసుకోబోతున్నామని వచ్చిన వదంతులపై తీవ్రంగా కలత చెందినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే సాయిధరమ్ తేజ్, రెజీనాకి మధ్య ఎఫైర్ నడుస్తుందని త్వరలో వీరిద్దరు తమ ఇంట్లో పెద్దలని ఒప్పించి పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది.

