Rewind 2025:ఈ ఏడాది చనిపోయిన ప్రముఖులు వీరే!

8
- Advertisement -

2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇక ఈ ఏడాది ఎంతోమంది ప్రముఖులు చనిపోయారు. బాలీవుడ్ “హీ-మ్యాన్”గా పేరుగాంచిన ధర్మేంద్ర, దీర్ఘకాల అనారోగ్యంతో నవంబర్ 24న 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన, నవంబర్ 12న ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

మహాభారతం సీరియల్‌లో కర్ణుడి పాత్రతో ప్రసిద్ధి చెందిన నటుడు పంకజ్ ధీర్, క్యాన్సర్‌తో దీర్ఘకాల పోరాటం అనంతరం అక్టోబర్ 15న 68 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన కుమారుడు నికితిన్ ధీర్ కూడా ప్రముఖ నటుడే.భారతీయ ఆధునిక ప్రకటన రంగాన్ని తీర్చిదిద్దిన ప్రముఖ అడ్వర్టైజింగ్ లెజెండ్ పీయూష్ పాండే అక్టోబర్ 24న 70 ఏళ్ల వయసులో కన్నుమూశారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో క్యాడ్‌బరీ, ఫెవికాల్ వంటి బ్రాండ్లకు ఎన్నో ఐకానిక్ ప్రచారాలను రూపొందించారు. ఆయన అంత్యక్రియలకు అమితాబ్ బచ్చన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

మాజీ కేంద్ర హోంమంత్రి, లోక్‌సభ స్పీకర్ శివరాజ్ పాటిల్ డిసెంబర్ 12న 90 ఏళ్ల వయసులో మరణించారు. 2008 ముంబై ఉగ్రదాడి సమయంలో ఆయన హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ఆగస్టు 4న 81 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తండ్రి. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

Also Read:Modi:క్రిస్మస్ వేడుకల్లో మోదీ

ప్రఖ్యాత అస్సామీ గాయకుడు, స్వరకర్త, బాలీవుడ్ కళాకారుడు జుబీన్ గార్గ్ సెప్టెంబర్ 19న సింగపూర్‌లో ఈత కొడుతుండగా మృతి చెందారు. ఆయన మృతి కారణాలపై అనుమానాలు వ్యక్తమవడంతో అస్సాం పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ‘యా అలీ’, ‘దిల్ తూ హీ బతా’ వంటి పాటలు ఆయనకు విశేష గుర్తింపు తెచ్చాయి.

సరభాయ్ వర్సెస్ సరభాయ్ వంటి సీరియల్స్‌తో ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ నటుడు సతీష్ షా అక్టోబర్ 25న 74 ఏళ్ల వయసులో మూత్రపిండాల వైఫల్యంతో మరణించారు. మైన్ హూన్ నా, హమ్ సాథ్ సాథ్ హై, జానే భీ దో యారో, కల్ హో నా హో, జుడ్వా, హీరో నెం.1 వంటి అనేక చిత్రాల్లో ఆయన నటించారు. బాలీవుడ్‌కు తన ప్రత్యేక హాస్య శైలితో కొత్త దిశ చూపిన నటుడు అస్రానీ అక్టోబర్ 20న 84 ఏళ్ల వయసులో ముంబైలో కన్నుమూశారు. షోలే చిత్రంలోని ఆయన పాత్ర, సంభాషణలు చిరస్మరణీయమైనవి. 350కుపైగా చిత్రాల్లో ఆయన నటించారు.

 

- Advertisement -