ఫ్యామిలీ స్టార్ కూడా మల్టీస్టారరేనా?

34
- Advertisement -

2024 సంవత్సరంలోని మోస్ట్ ఎవెటెడ్ మూవీస్‌లో హీరో విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” కూడా ఒకటి. ఎంటర్టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ స్టార్ చిత్రం పై మొదటి నుంచి మంచి హైప్ ఉంది. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే హై బడ్జెట్, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఏదో రకంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాపై వైరల్ అవుతోన్న వార్త వింటే.. ఫ్యామిలీ స్టార్ మల్టీస్టారరా? అని ఆశ్చర్యపోకమానరు.

అవును.. ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ మాత్రమే కాకుండా మరో యంగ్ హీరో కూడా నటిస్తున్నాడట. ఆ యంగ్ హీరో మరెవరో కాదు.. నవీన్ పోలిశెట్టి. విజయ్ దేవరకొండ బ్రదర్‌ గా నవీన్ పోలిశెట్టి ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడనేలా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ స్టార్ పార్ట్ 2 కూడా ఉంటుందని.. పార్ట్ 2 లో నవీన్ పోలిశెట్టి పాత్ర బాగా హైలెట్ అవుతుందని, మొదటి పార్ట్ ఎండింగ్‌లో వచ్చే ట్విస్ట్ నవీన్ పోలిశెట్టి పాత్రదే అనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో చూడాలి. దీనిపై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మృణాల్ ఠాగూర్ హీరోయిన్‌గా పరిచయం చేస్తోన్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఇటు క్లాస్ గా అటు మాస్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. “ఫ్యామిలీ స్టార్” చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నాడు.

Also Read:బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే..!

- Advertisement -