నటుడు పృథ్వీరాజ్‌కు చుక్కెదురు

3
- Advertisement -

నటుడు పృథ్వీరాజ్‌కు షాక్ తగిలింది. మనోవర్తి చెల్లించాలంటూ పృథ్వీ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మి విజయవాడ ఫ్యామిలీ కోర్టులో కేసు వేయగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మికి నెలకు రూ.8 లక్షలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను పాటించని పృథ్వీ హైకోర్టులో సవాలు చేశారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ భార్యకు నెలకు రూ.22వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది.

దీనిని పృథ్వీరాజ్ ఖాతరు చేయలేదు. దీంతో భార్య శ్రీలక్ష్మి తన న్యాయవాదులు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేయగా పృథ్విరాజ్‌కు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్ వారెంటు జారీ చేశారు.

Also Read:40 శాతం మంది ప్రజలు మనవైపే:జగన్

- Advertisement -