సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం: దిల్ రాజు

3
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత పలు మాధ్యమాల్లో ఫేక్ వార్తలు ప్రసారం అవుతున్నాయి అన్నారు ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు. సీఎం మీటింగ్ లో అసలు జరగనివి కూడా జరిగినట్టు వార్తలు వేస్తున్నారు…సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ చాలా బాగా జరిగిందన్నారు. 0.5 పర్సెంట్ కూడా నెగిటివ్ లేదు అని…సినీ ఇండస్ట్రీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు అన్నారు.

బెనిఫిట్స్ షోలు టిక్కెట్ రేట్స్ గురించి అసలు టాపిక్ రాలేదు అన్నారు. పోలీసులు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వీడియో లు మాకు ప్రదర్శించలేదు …బౌన్సర్స్ విషయాన్ని మాకు డీజీపీ చెప్పారు ప్రతిదీ అకౌంట్ బిలిటీగా ఉండాలి అని డీజీపీ సూచించారు అన్నారు.

హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ లో షూటింగ్ జరిపేలా అభివృద్ధి చేద్దాం అన్నారు.హైదరాబాద్ కు ఐటీ ఫార్మా రంగాలు ఎంత కీలకమో సినీ పరిశ్రమకూడా అంతే కీలకం గా భావిస్తున్నట్టు సీఎం చెప్పారు అన్నారు. సామాజిక సేవ కార్యక్రమాల్లో సెలబ్రటీలు పాల్గొనాలి అని…అలాగే గద్దర్ అవార్డ్స్ ను FDC తో అనుసంధానంగా జరగాలి అని చెప్పారు అన్నారు.

Also Read:సీఎం పదవి ఆఫర్‌నే తిరస్కరించా: సోనుసూద్

- Advertisement -