అల్లు అర్జున్ వర్సెస్ ఫహాద్‌..కన్నుల పండగే!

159
bunny
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో విలన్‌గా నటించనుండగా ఆగస్టు నెలలో పుష్ప సెట్స్‌లో చేరనున్నారు.

ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్… ఫహద్ ఫాసిల్ మధ్య హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారు. ఇందులో ఫహద్ ఫాసిల్ అవినీతి పోలీసుగా నటిస్తుండగా ఇక ‘పుష్ప’లో తన పాత్ర చాలా ఫ్రెష్ గా ఉందని, ఇంతకు ముందు ఇలాంటిది చేయలేదని చెప్పాడు. ఇక బన్నీ – ఫహద్‌ మధ్య ఫైట్ ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు, ధనంజయ్, ప్రకాష్ రాజ్, హరీష్, వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మొదటిసారిగా గిరిజన యువతి పాత్రను పోషిస్తోంది.

- Advertisement -