బుల్లితెర ‘రాములమ్మ’ యాంకర్ శ్రీముఖి.. ఈమెకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెర పై అలాగే సోషల్ మీడియాలో కూడా స్టార్ గా మంచి పేరు తెచ్చుకుంది. శ్రీముఖి ఫొటోషూట్లు కూడా చాలా పాపులర్. అలా ‘క్రేజీ హాట్ సెన్సేషన్’ అనిపించుకున్న ఈ బ్యూటీ, ఈ ఏడాది పెళ్లి చేసుకుంటుందట. శ్రీముఖి ఓ బిజినెస్‌మెన్ తో ఏడడుగులు వేయబోతుందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. పెళ్లి కోసమే కాస్త బొద్దుగా ఉండే శ్రీముఖి ప్రస్తుతం బరువు కూడా తగ్గిందని టాక్ నడుస్తోంది.
పైగా గత కొంతకాలంగా శ్రీముఖి ఆ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని, అతడితో ఆ మధ్య శ్రీముఖి వెకేషన్ కి కూడా వెళ్లి వచ్చిందని.. తాజాగా ఆ బిజినెస్ మేన్ తోనే శ్రీముఖి పెళ్లికి కూడా రెడీ అయిందని.. ఇందులో భాగంగానే.. ఈ ఏడాది శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుందంటూ గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. శ్రీముఖి సన్నిహితుల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం.. ఆమెకు పెళ్లి పై పెద్దగా ఆసక్తి లేదట. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం అంటూ శ్రీముఖి ఫ్రెండ్స్ చెబుతున్నారు.
మొత్తమ్మీద శ్రీముఖికి దగ్గరగా ఉండే వ్యక్తుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. శ్రీముఖి వైవాహిక జీవితం ఈ ఏడాది నుంచి కచ్చితంగా మొదలవ్వదు. ఇక తన పెళ్లి గురించి శ్రీముఖిని ప్రశ్నిస్తే.. ముసిముసిగా నవ్వుకొని పక్కకు తప్పుకుంటుంది. సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఫ్యాన్స్ శ్రీముఖి పెళ్లి పై రకరకాలుగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయినా సీరియస్ గా కెరీర్ పై దృష్టి పెట్టిన శ్రీముఖి, పెళ్లి చేసుకుంటుందంటూ చెప్పించడం సరైనది కాదంటూ ఆమె ఫ్యాన్స్ లో కొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తమ్మీద సోషల్ మీడియాలో నేడు శ్రీముఖి పెళ్లి టాపిక్ హాట్ టాపిక్ అయింది.
ఇవి కూడా చదవండి…