పెళ్లికి ముందే తల్లి అయ్యిందట

62
- Advertisement -

బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియా భట్ కి విశేష అభిమానులు ఉన్నారు. అలియా డేట్స్ కోసం పడిగాపులు కాసే నిర్మాతలు ఉన్నారు. అలియా నటనకు ఫిదా అయిపోయిన దిగ్గజ దర్శకులు ఉన్నారు. పైగా ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ సినిమా ఆమె ఖాతాలో ఉంది. ఇన్నీ ఉన్నా.. చిన్న వయసులోనే ఆలియా పెళ్లి చేసుకుని, తల్లి అయింది. గతేడాది ఏప్రిల్ లో రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన 8 నెలలకే ఆడ పిల్లకు జన్మనిచ్చింది అలియా. దీంతో అలియా పెళ్లికి ముందే గర్భవతి అంటూ సోషల్ మీడియాలో ఆమె పై నెగిటివ్ కామెంట్లు విపరీతంగా వచ్చాయి.

ట్రోలర్స్ ఆమెను ఈ విషయంలో చాలా దారుణంగా ట్రోల్ చేశారు. అయినా అలియా ఎన్నడూ ఈ విషయం పై రియాక్ట్ కాలేదు. ఐతే, చాలా గ్యాప్ తర్వాత ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది అలియా. ‘ అవును, నేను పెళ్లికి ముందే గర్భం దాల్చడం చాలా మందికి నచ్చలేదు. నిజానికి ఇది ప్లాన్ చేసింది కాదు. ఎప్పటి నుంచో రణబీర్ – నేను చాలా దగ్గరగా ఉంటున్నాం. ఈ క్రమంలోనే వివాహానికి ముందే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. దీంతో సినిమాల్లో యాక్షన్ సీన్లు చేయడానికి కూడా నేను బాగా ఇబ్బంది పడ్డాను’ అంటూ అలియా చెప్పుకొచ్చింది.

అలియా ఈ విషయం గురించి ఇంకా మాట్లాడుతూ.. ‘తల్లి కావడం గొప్ప అదృష్టం. ఐతే, చిన్న వయసు, స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో పెళ్లి చేసుకుని పిల్లలను కనడం వల్ల హీరోయిన్‌గా చాన్సులు తగ్గిపోతాయని పలువురు సన్నిహితులు నాకు చెప్పారు. కానీ, నా దృష్టిలో తల్లి కావడం గొప్ప అదృష్టం. ఈ అవకాశాన్ని నేను తొందరగా పొందినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే, నేను ఎంతో ఇష్టంగా తీసుకున్న నిర్ణయం ఇది’ అంటూ ఆలియా ఓపెన్ గా నిజం చెప్పేసింది.

ఇవి కూడా చదవండి…

భవిష్యత్‌లో ఫోర్న్ సినిమాలు చేస్తారెమో.!

తమిళంలో ఫస్ట్ సినిమా…

బుచ్చిబాబు ఏం చేస్తాడో ?

- Advertisement -