ఇటీవలే డేటాలీకేజీ వివాదంలో ఫేస్‌బుక్ ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామంది నెటిజన్లు హ్యాష్ ట్యాగ్‌తో డిలీట్ ఫేస్‌బుక్ అనే నినాదాన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ట్రైచేశారు. అయితే ఇప్పుడున్న యువత నరనరాల్లో పాకిన సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్’ కి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదని తాజాగా రుజువైంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ..సంస్థ లాభాలు, యూజర్ల నమ్మకంపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి.

2018 ఫస్ట్ క్వార్టర్ (తొలి త్రైమాసికం) ఫలితాలను ఫేస్‌బుక్ బుధవారం (ఏప్రిల్ 25) వెల్లడించింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో సంస్థ నికర లాభంలో 65 శాతం వృద్ధి సాధించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఫేస్‌బుక్ నికర లాభం 4.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆదాయం కూడా 49 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లకు చేరింది. అంతేకాదు.. గతంతో పోలిస్తే ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఫేస్‌బుక్ నెలవారీ యూజర్ల సంఖ్య 2.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. కిందటేడాదితో పోలిస్తే ఇది 13 శాతం అధికం కావడం విశేషం.
అయితే తాజా ఫలితాల నేథ్యలో వాల్ స్ర్టీట్ ఫేస్‌బుక్ షేర్లు భారీ లాభాలతో దూసుకెళ్ళాయి. షేరు విలువ 7 శాతానికి పైగా పెరిగింది. ఫేస్‌బుక్‌కు ఎన్ని చిక్కులు ఎదురైనా.. అవేవీ సంస్థ లాభాలు, యూజర్ల విశ్వసనీయతపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయాయనడానికి ఈ ఫలితాలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఫేస్‌బుక్కైనా…సోషల్ మీడియాలో కింగేనని మళ్ళీ నిరూపించుకుంది ఫేస్ బుక్.

