ఫేస్ బుక్ ఫైండర్ మార్క్ జుకర్ బర్గ్ 11 ఏళ్ల తర్వాత ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 1967 నాటి స్పైడర్ మ్యాన్ కార్టూన్ ను తొలి పోస్ట్ చేసిన జుకర్ దానికి ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. చివరగా 2012 జనవరి 18న జుకర్ చివరిసారిగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆతర్వాత ట్విట్టర్‌లో పోస్టు చేయడం ఇదే తొలిసారి. ఇక ఆ పోస్టు కూడా ట్విట్టర్ అధినేత మస్క్ ను ఉద్దేశించే పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవలె ట్విట్టర్‌కు పోటీగా జుకర్ బర్గ్ కొత్త యాప్ ‘థ్రెడ్స్’ పేరుతో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుండే ఈ యాప్ అందుబాటులోకి రాగా ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 20 లక్షల మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు.
Also read:సింగిల్ పోస్ట్ లేకుండా 2 మిలియన్ ఫాలోవర్స్!
మెటా తీసుకొచ్చిన ఈ కొత్త థ్రెడ్స్ యాప్ ను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను వినియోగించి లాగిన్ చేసుకోవచ్చు. లింక్స్, ఫొటోలు, ఐదు నిమిషాల నిడివిగల వీడియోలను పోస్ట్ చేసుకోవచ్చు.
Also Read:బండి సంజయ్ పనైపోయిందా..?