సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న ఎఫ్‌ 3!

132
f3
- Advertisement -

వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మోర్ ఫ‌న్ రైడ‌ర్ ‘ఎఫ్3’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది. ఎఫ్ 3 వేసవిలో విడుదలవుతుందని, ఇప్పటి వరకు సినిమా 70 శాతం షూటింగ్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసిందని వెంకటేశ్ వెల్లడించారు.

వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “ఎఫ్3” చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్ గా వ్యవహరిస్తున్నారు.

సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ వంటి పెద్ద సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఎఫ్ 3 రిలీజ్ డేట్‌ను పోస్ట్‌ పోన్ చేసుకున్నారు మేకర్స్‌.

- Advertisement -