ఎఫ్‌ 3…ఫన్ బాంబ్‌!

39
f3
- Advertisement -

వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్‌ 3. ఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం మే 27న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్రం నుంచి సొమ‌వారం ఉద‌యం 10.08 నిమిషాల‌కు ‘బ్లాస్టింగ్ టుమారో’ అంటూ వీడియోను పోస్ట్ చేశారు.

అయితే సినిమా నుంచి ఏం విడుద‌ల‌వుందో క్లారిటీ ఇవ్వ‌లేదు. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రి ఏం బ్లాస్ట్ అవుతుందో తెలియాలంటే ఒక రోజు ఆగాల్సిందే. శ్రీ వెంకటేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

- Advertisement -