తెలంగాణ రాకముందు..వచ్చిన తర్వాత

214
venky varun tej
- Advertisement -

వెంకటేష్‌-వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఎఫ్‌2. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వెంకీ ఫన్నీ డైలాగ్‌తో టీజర్‌ ఆరంభమైంది. ఇప్పుడు ఈ పెళ్లి అవసరమా వెంకీ? అని రఘుబాబు అంటే.. నేను మీలాగా కాదు.. పెళ్లాంని ఎలా కంట్రోల్‌ చేయాలో నాకు బాగా తెలుసు అని భార్య తమన్నాతో వేగలేక ముప్పతిప్పలు పడుతూ కనిపించారు.

ఓ చరిత్ర చెప్పాలంటే తెలంగాణ రాకముందు.. తెలంగాణ వచ్చిన తర్వాత అని వరుణ్‌ తన బాధను వెళ్లగక్కే ప్రయత్నం చేశారు. కామెడీ నేపథ్యంలో తెరకెక్కగా సంక్రాంతికి తోడల్లుళ్లు నవ్వించేందుకు వస్తున్నారు అన్న టీజర్‌ అందరిని ఆకట్టుకుంటోంది…ఈ టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి……..

- Advertisement -