విడుదలకు సిద్ధమౌతున్న ‘మణికర్ణిక’..

258
Manikarnika
- Advertisement -

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘మణికర్ణిక’. ఈ సినిమాలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాను హిందీతోపాటు తెలుగు .. తమిళ భాషల్లో జనవరి 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

Manikarnika

ఈ సినిమాకు కొంత భాగం క్రిష్ దర్శకత్వం వహించగా, ఆ తరువాత దర్శకత్వ బాధ్యతలను కంగనానే చూసుకుంటూ వస్తోంది. శంకర్ .. ఎహసాన్ .. లాయ్ .. సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే ఆశాభావంతో కంగనా వుంది.

- Advertisement -