‘ఎఫ్ 2’ నుంచి మరో సాంగ్‌ రెడీ..

302
F2 second song
- Advertisement -

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌-వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఎఫ్‌2.ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్షకుల‌కు అందించిన శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు నమోదుచేసిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్‌కు జంటగా తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ నటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

F2 second song

ఇటీవల విడుదలైన ఫస్ట్‌ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో రేపు ఉదయం 11 గంటలకి, ‘ఎంతో ఫన్ .. ‘ అంటూ సాగే సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. దేవిశ్రీ స్వరపరిచిన ఈ సాంగ్ కూడా జోరుగా .. హుషారుగా కొనసాగుతుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన పోస్టర్స్ కి .. టీజర్ కి .. సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో టీమ్ వుంది.

- Advertisement -