మెగాప్రిన్స్ వరుణ్ తేజ్-వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఎఫ్2.ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు నమోదుచేసిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమాతో వెంకీ-వరుణ్ నవ్వులు పూయించారా..?ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నారో చూద్దాం…
కథ:
వెంకీ (వెంకటేష్) ఓ ఎమ్మెల్యే దగ్గర పీఏ పనిచేస్తుంటాడు. హారిక(తమన్నా), హనీ(మెహరీన్) అక్కా చెల్లెళ్లు. హారికను పెళ్లి చేసుకుంటాడు వెంకీ. అప్పటివరకూ సాఫీగా సాగిపోతున్న వెంకీ జీవితం పెళ్లితో ఒక్కసారిగా మారిపోతుంది. సీన్ కట్ చేస్తే వరుణ్ యాదవ్(వరుణ్‌తేజ్) హనీని ఇష్టపడతాడు. అప్పటికే అత్తింటి పరిస్థితులు అర్థమైన వెంకీ.. హనీని పెళ్లి చేసుకోవద్దని వరుణ్‌యాదవ్‌ను హెచ్చరిస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది..?కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే ఎఫ్ 2 కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ వెంకటేష్,ఫస్టా ఫ్,డైలాగ్‌లు. చాలా కాలం తర్వాత వెంకీ తనదైన కామెడీతో నవ్వులు పూయించారు. సినిమా మొత్తం వెంకీ నవ్వులు పూయించారు. వరుణ్ తేజ్ కూడా చక్కగా నటించాడు. తెలంగాణ యాసలో అదరగొట్టాడు.చాలా రోజుల తర్వాత తమన్నా తన పర్ఫామెన్స్‌తో అదరగొట్టింది. మెహరీన్,రఘుబాబు, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, నాజర్‌లు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కథ,సెకండాఫ్,పాటలు.ఫస్టాఫ్ కథలో ఉన్న బలం సెకండాఫ్‌లో కనిపించదు.కామెడీ కొన్ని చోట్ల శృతిమించిది. అక్కడక్కడా సన్నివేశాలను పేర్చుకుంటూ వెళ్లిపోవడంతో కాస్త సాగదీతగా అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా బాగుంది. రచయితగా అనిల్‌రావిపూడి సక్సెస్ అయ్యాడు. మొదటి నుంచి చివరి వరకూ సినిమా ఒకేలా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగుంది. కెమెరా పరంగా కలర్‌ఫుల్‌గా ఉందీ సినిమా. సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్ బాగుంది. దిల్ రాజు నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరీలాంటి చిత్రాల తర్వాత మళ్లీ అలాంటి పాత్రతో వెంకీ..వరుణ్ తేజ్‌తో చేసిన మల్టీస్టారర్ ఎఫ్ 2. వెంకీ కామెడీ,ఫస్టాఫ్ సినిమాకు ప్లస్ కాగా కథ,సెకండాఫ్ మైనస్ పాయింట్స్.ఓవరాల్‌గా సంక్రాంతికి కొత్త అల్లుళ్లు పంచే కామెడీ మూవీ ‘ఎఫ్2’.
విడుదల తేదీ:12/01/2019
రేటింగ్:2.75 /5
నటీనటులు: వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: దిల్‌రాజు
దర్శకత్వం: అనిల్ రావిపూడి