ఎఫ్2 నుండి ‘ఎంతో ఫ‌న్’ వచ్చేసింది..(వీడియో)

263
- Advertisement -

యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఎఫ్ 2 ‘ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్’ అనేది ట్యాగ్‌లైన్‌. యంగ్ హీరో వ‌రుణ్ తేజ్, విక్ట‌రీ వెంకటేశ్ లు ఈచిత్రంలో న‌టిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రిన్, వెంక‌టేశ్ స‌ర‌స‌న త‌మ‌న్నాలు హీరోయిన్ లు గా న‌టిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. వెంకీ, వరుణ్ తోడళ్లుళ్లుగా కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశారు.

F2 Movie

తాజాగా శ్రీమ‌ణి లిరిక్స్ అందించిన ఎంతో ఫ‌న్ అనే లిరిక‌ల్ సాంగ్ వీడియోని విడుద‌ల చేశారు. ఈ పాట ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంది. వెంకీ, త‌మ‌న్నా కెమిస్ట్రీ బాగుంద‌ని చెబుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటుంది. జ‌న‌వ‌రి 12న ఈ మూవీ విడుదల కాబోతుంది.

https://youtu.be/kzdU33jBpbA

- Advertisement -